ఆండ్ర రిజర్వాయర్లో మృతదేహం కలకలం

82చూసినవారు
ఆండ్ర రిజర్వాయర్లో మృతదేహం కలకలం
మెంటాడ మండలంలో ఆండ్ర రిజర్వాయర్లో గురువారం ఉదయం మృతదేహం కలకలం రేపింది. మృతుడు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ బీటగరువుకు చెందిన గమ్మేళ భీమరాజు (22)గా స్థానికులు గుర్తించారు. భీమరాజు మరో ముగ్గురితో కలిసి మంగళవారం రాత్రి చేపలు పట్టడానికి వచ్చారు. చీకటిలో భీమరాజు కనబడకపోయేసరికి ఇంటికి వెళ్లిపోయామని, మృతదేహం తేలడంతో గుర్తించినట్లు అతని స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్