అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఏపీ అంగన్వాడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు బలగ రాధ ఆధ్వర్యంలో వినత పత్రం ఇచ్చారు. మంత్రి నివాసంలో ఏపీ అంగన్వాడీ ఉద్యోగుల సంఘం సభ్యులు కలసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బలగరాద మాట్లాడుతూ మెనీఫర్ పూర్ ప్రెగ్నైట్ ఉమెన్, చిల్డ్రన్ సేవలు అందిస్తున్నామని అన్నారు.