మెంటాడ మండలంలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు ఆండ్ర ఎస్సై బి. దేవి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె తెలిపిన వివరాలు ప్రకారం విజయనగరం జిల్లా పరిధిలోని సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం ఆండ్ర సంత సమీపంలో 35 మద్యం సీసాలతో ఒక మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆమె వద్ద నుండి 35 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.