రైతులకు ఎరువులు, పురుగు, తెగులు మందులు పంటలపై వచ్చే వ్యాధుల నివారణకోసం మిత్ర పురుగులు, శత్రు పురుగులు వంటి వాటిపై ఎంత మేర అవగాహన ఉందో తెలుసుకుని వారికి 14 వారాల పొలంబడిలో వివిధ అంశాలపై అవగాహన వచ్చే విధంగా తయారు చేయడమే పొలంబడి ప్రధాన ఉద్దేశమని పాచిపెంట వ్యవసాయ అధికారి తిరుపతిరావు తెలిపారు. మండలం పెద్ద కంచూరు గిరిజన గ్రామంలో ఏర్పాటు చేసిన పొలంబడి కార్యక్రమంలో రైతులకు బ్యాలెట్ బాక్స్ పరీక్ష నిర్వహించారు.