మక్కువలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షానికి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, శిథిల భవనాల కింద ఉండరాదని అధికారులు హెచ్చరించారు.