పార్వతీపురం మండలం పెదమరికి గ్రామపంచాయతీ కొత్తఊరు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్పు చేయాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రను కోరారు. గురువారం టీడీపీ కార్యాలయంలో గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.