సాలూరులో జగన్నాధస్వామి రథయాత్ర 9 రోజులు, భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం గుండీచ ఆలయం నుండి జగన్నాధస్వామి, బలభద్రుడు, సుభద్ర సమేతంగా, శ్రీ మందిరానికి రధంపై తిరుగు ప్రయాణంలో స్వామివారి పినతల్లి అయిన యసోదదేవి ఇంటివద్ద ఆగుతారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త విక్రమ చంద్ర సన్యాసి రాజుచే పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.