మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు అయినట్లు ఎస్ఐ సీతారామ మంగళవారం తెలిపారు. కూనేరు గ్రామానికి చెందిన కనిమెరక అచ్చియమ్మ తన భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. గతంలో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. అయినా మార్పు రాకపోవడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.