ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీ గా అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాచిపెంట మండలంలోని కొటికిపెంట పంచాయితీ నీలయమ్మ చెరువు వద్ద కోడి కాలవలస, గరిల్లవలస గ్రామాల ఉపాధికూలీలతో ఆయన మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాధించుకున్న ఉపాధి చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు