సీతానగరం మండలంలోని జోగింపేట ప్రతిభా పాఠశాల/కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంగ్లమాధ్యమంలో ప్రవేశానికి మార్చి 23 లోగా ఆన్లైన్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీటీడబ్ల్యూ గురుకులం. ఏపీ. జీఓవీ. ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.