గ్రామసభల్లో వచ్చిన మ్యూటేషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పాచిపెంట మండలంలోని మోసూరులో రెవెన్యూ సమస్యలపై శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు పిఒ హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. భూ సవరణలకు సంబంధించి మ్యూటేషన్ కొరకు పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. రీ సర్వేలో తప్పులు దొర్లకుండా పక్కగా నిర్వహించాలన్నారు.