విశాఖ డైరీ పరిధిలోని పాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతులు సంఘం డిమాండ్ చేసింది. సాలూరు పట్టణంలో శుక్రవారం విశాఖ డైరీ కేంద్రం వద్ద రైతులు నిరసన తెలియజేసి డిమాండ్ల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్. వై. నాయుడు, పాల రైతుల సంఘం నాయకులు యోగి, రెడ్డి రాము తదితరులు మాట్లాడారు.