కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం బెంగళూరులో కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. హోంమంత్రి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో ఈ పథకం అమలు చేయడం వల్ల అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న, ప్రయోజనాలను బస్సుల్లో ప్రయాణిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.