ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబර పోలమాంబ అమ్మవారి మారుజాతరకు మంగళవారం(నేడు )వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో వి. సూర్యనారాయణ, సీఐ రామకృష్ణలు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం రథసప్తమి పండగ కారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందేమోనని, అధికారులు భావిస్తున్నప్పటికీ, రద్దీ ఎక్కువైతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వనంగుడి, చదురుగుడిల వద్ద క్యూలు ఏర్పాటు చేశారు.