సాలూరు: దబ్బగెడ్డ-డి. శిర్లాం రోడ్డుకు మోక్షమెప్పుడు..?

58చూసినవారు
సాలూరు: దబ్బగెడ్డ-డి. శిర్లాం రోడ్డుకు మోక్షమెప్పుడు..?
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని దబ్బగెడ్డ-డి. శిర్లాం, కొత్తవలస-డి. శిర్లాం గ్రామాల రహదారుల నిర్మాణానికి మోక్షం ఎప్పుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు గోతులు ఏర్పడిన రహదారిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలం వస్తే ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్