సాలూరు: కోళ్ల ఫారం ఊరికి దూరంగా ఉండాలి

84చూసినవారు
సాలూరు: కోళ్ల ఫారం ఊరికి దూరంగా ఉండాలి
మెంటాడ మండలం బిరసాడవలస గ్రామస్తులు కోళ్ల ఫారం సమస్యపై మంగళవారం మంత్రి సంధ్యరాణికి వినతిపత్రం అందజేశారు. ఆమె సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారని మెంటాడ మండల జనసేనా నాయకులు సబ్బవరపు రాజశేఖర్ తెలియజేశారు. దుర్గంధం వెదజల్లుతున్న కోళ్ల ఫారం తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మన్నెపురి అప్పలనాయుడు, టోకురు రామకృష్ణ, టైగర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్