సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ఆరుగురు లబ్ధిదారులకు రూ. 3,65,917 లను సాలూరు మంత్రి కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు.