సాలూరు: అందరికి సమాన వేతనం ఇవ్వాలి

80చూసినవారు
సాలూరు: అందరికి సమాన వేతనం ఇవ్వాలి
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇంజినీరింగ్‌, పారిశుధ్య విభాగాల్లో పనిచేసే కార్మికులందరికీ సమాన వేతనాలు చెల్లించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. పారిశుధ్య కార్మికులకు రూ.21,000 ఇవ్వగా, ఇంజినీరింగ్‌ విభాగ కార్మికులకు కేవలం రూ.15,000 ఇవ్వడం అన్యాయమని విమర్శించారు.

సంబంధిత పోస్ట్