బడ్జెట్ సమావేశాల్లో జిల్లా అభివృద్ధికి రూ. 10వేల కోట్లు నిధులు కేటాయించాలని, తద్వారానే పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీలవుతుందని సిపిఎం నాయకులు కె. గంగు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సాలూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఎం ప్రతినిధి బృందం పర్యటించింది. సాలూరు పట్టణంలో రైతు బజారు నిర్మాణం పూర్తయినా పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ వాడుకలోకి రాలేదన్నారు.