సాలూరు పట్టణంలో వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నాటికి బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.