సాలూరు పట్టణంలోని కొలకోటి వీధిలో భారీ చోరీ జరిగింది. స్థానికులు కోట దేవి, ప్రసాద్ కుటుంబం బుధవారం ఒడిశాలోని గుప్తేశ్వరం వెళ్లారు. శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఉండగా, బంధువులు ఫోన్ చేసి ఇంటి తలుపులు ఓపెన్ అయి ఉండటంతో పాటు బీరువాలు పగలగొట్టినట్లు తెలిపారు. ఇంటికి వచ్చి చూశేసరికి రూ.20 లక్షల విలువైన 15 తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.