సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుందామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె గురువారం సాలూరు లో మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ ఆదివారం ఉయ్యాల కంబాల చక్కగా చేసుకుంటామని శ్యామలాంబ అమ్మవారి గద్దె నుంచి అమ్మవారిని తీసుకువెళ్లి ఉయ్యాల కంబాల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈనెల 19వ తేదీ సోమవారం తొలి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.