సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి జరిగిన జెంటిల్ మెన్ ఒప్పందం అమలు చేయని కారణంగా తనకు అన్యాయం జరిగిందంటూ వైసీపీకి రాజీనామా చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జరాజాపు దీప్తి తెలిపారు. ఆమెతో పాటు పార్టీ, పదవులకు, రాజీనామా చేసినట్లు జరజాపు సోదరులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈశ్వరరావు, పట్టణ మాజీ అధ్యక్షుడు సూరిబాబు తెలిపారు. తన మున్సిపాలిటీ, వార్డు ప్రజలు తన ఆవేదన అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.