బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి ఎంపిడివో రమాదేవి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.