సాలూరు: రూ. 95కోట్లతో తాగునీటికి ప్రతిపాదనలు

69చూసినవారు
సాలూరు: రూ. 95కోట్లతో తాగునీటికి ప్రతిపాదనలు
ఆండ్ర ప్రాజెక్టు ద్వారా తాగునీటిని 77 గ్రామాలకు అందించేందుకు రూ. 95కోట్లతో ప్రతిపాదనలు పంపనున్నట్లు రక్షిత మంచినీటి పథకం డిఇ తిరుపతినాయుడు తెలిపారు. బుధవారం ఆండ్ర, లోతుగెడ్డ, కూనేరు నీటిఎద్దడి వున్న గిరిజన గ్రామాల్లో పర్యటించారు. సాలూరు నియోజకవర్గం ఆండ్ర పంచాయతీలో కొండజీరికివలస, కుంబివలస, వేపగుడ్డి గ్రామాలను పరిశీలించి రూ. 80లక్షలతో వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించి కొళాయిల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్