సాలూరు: స్కూళ్లలో పుస్తకాల అమ్మకాలు ఆపాలి

73చూసినవారు
సాలూరు: స్కూళ్లలో పుస్తకాల అమ్మకాలు ఆపాలి
విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా సాలూరులోని పలు కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలు నిలిచాయని, విచ్చలవిడిగా పుస్తకాల వ్యాపారం చేపడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు టి. అఖిల్‌ అన్నారు. గురువారం సాలూరు లయిన్స్‌ క్లబ్‌ స్కూల్‌ యాజమాన్యం పుస్తకాల విక్రయాలు చేపడుతుండడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం తెలిపినప్పటికీ స్పందించకపోవడంతో బైఠాయించారు.

సంబంధిత పోస్ట్