సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలోని పి. కోనవలస ఏపీటీ డబ్ల్యూ జూనియర్ కళాశాలలో జువాలజీ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు సోమవారం కళాశాలకు బయలుదేరే క్రమంలో ఇంటివద్ద గుండెపోటుకు గురై మతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది, విద్యార్థులు శ్రీనివాసరావు ఇంటికి వచ్చి ఆయన మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు.