సాలూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణమైన టిడ్కో ఇళ్లను లబ్దిదారులందరికీ వెంటనే అందజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. సీపీఎం బృందం బుధవారం పరిశీలించింది. సాలూరు పట్టణంలో ఇళ్లు లేని పేదలందరికీ టిడ్కో ద్వారా 1248 ఇళ్లను ప్రభుత్వం నిర్మించినా నేటి వరకు లబ్ధిదారులకు అందించకపోవడం దారుణమని అన్నారు. పేదల సమస్యలపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు.