సాలూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

79చూసినవారు
సాలూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పాచి పెంట మండలంలోని ఎగువకొత్తవలస సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని శుక్రవారం ఎస్ ఐ వెంకటసురేష్ తెలిపారు. మృతుడి వయసు 50 ఏళ్లు ఉంటుందని, 5 అడుగుల పొడవు, తెలుపు, నలుపు, నీలం రంగుల టీషర్టు ధరించి ఉన్నట్లు తెలియజేశారు. వీఆర్వో సమాచారంతో కేసు నమోదు చేశామని అన్నారు. ఆచూకీ తెలిసిన వారు పాచిపెంట పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.

సంబంధిత పోస్ట్