పసుపు ప్రాసెసింగ్ యూనిట్ అధినేత అల్లాడి సునీతకు ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా ఫాఫ్సీ అవార్డు లభించడం అభినందనీయమని ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. డివిజి శంకరరావు అన్నారు. ఆదివారం సాలూరులో ఆయన మాట్లాడుతూ.. గిరిజన వనరుల వినియోగానికి ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం అన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పించే ఇటువంటి పరిశ్రమలకు ప్రభుత్వం సహకరించాలన్నారు.