సీతానగరం మండలం మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అధ్యాపక బృందం ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం అడ్మిషన్స్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. మరిపివలసకు ఫీడింగ్ విలేజెస్ గా ఉన్న చినరాయుడుపేట, పాపమువలస, గుచ్చిమి, సూరంపేట తదితర గ్రామాలను పాఠశాల సిబ్బంది సందర్శించి పాఠశాల ప్రాముఖ్యతను వివరించారు. మరిపివలస పాఠశాలకు 20 మంది పిల్లలను జాయిన్ చేసుకున్నట్లు ఉపాధ్యాయుడు కవితనాయుడు తెలిపారు.