మెంటాడలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

75చూసినవారు
మెంటాడలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మెంటాడ మండలంలో బుధవారం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు కవులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్ చేశారు. అఖిలభారత కోర్కెల దినం పురస్కరించుకొని మెంటాడ తహసిల్దార్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని, లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని బిఎన్ఎస్ చట్టం రద్దు చేయాలని తదితర నినాదాలు చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ చక్రవర్తికు అందజేశారు.

సంబంధిత పోస్ట్