బొల్లినేనిలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

53చూసినవారు
బొల్లినేనిలో  అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
జెమ్స్ క్యాంపస్ లోని బొల్లినేని బీఎస్సీ పారామెడికల్ కళాశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. భోగి మంటలు వేశారు. సంప్రదాయ వస్త్రధారణలో అలరించారు. వివిధ సంక్రాంతి సినీ గీతాలకు నర్తించి, ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంప్రదాయ ముగ్గులు , గోరింటాకు , పాటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.సమత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మీ పద్మజ, అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్