ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

82చూసినవారు
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
విజయనగరం నుండి అనకాపల్లి వెళ్లే బస్సుకు గురువారం పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి వెళ్లేందుకు ఓ ఆర్టీసీ బస్సు విజయనగరం నుండి బయలుదేరిన నేపథ్యంలో భీమిసింగి వద్దకు వచ్చేసరికి బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరిపించుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను వేరొక బస్సులో తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్