మెంటాడ మండలం బిరసాడవలస గ్రామస్థులు మంగళవారం మంత్రి సంధ్య రాణిని కలిసి గ్రామంలోని కోళ్ల ఫారం నుంచి దుర్వాసనతో జీవించలేకపోతున్నామని దాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలంటూ వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.