పెన్షన్ల పంపిణీని సంక్రాంతి పండగలా జరుపుకోవాలి

76చూసినవారు
సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సంక్రాంతి పండగలా జరుపుకోవాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. ఎల్ కోట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రూపేష్ తదితర 4 మండలాల ఎంపీడీవోల తో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జులై 1 ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ చేపట్టాలని, మొదటి 2 రోజుల్లో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్