లోన్ యాప్ ల జోలికి వెళ్లొద్దు

69చూసినవారు
లోన్ యాప్ ల జోలికి వెళ్లొద్దు
వేపాడ మండలం జగ్గయ్యపేట గ్రామాన్ని ఎస్ ఐ బి దేవి శనివారం సందర్శించారు. ముందుగా ఆమె చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. లోన్ యాప్ దురాగతాలకు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి యాప్ ల జోలికి వెళ్లొద్దని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ ఆగడాలు మితిమీరుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్