ఎల్ కోట: మామిడి రైతులతో సమావేశమైన జిల్లా ఉద్యానవన అధికారి

57చూసినవారు
ఎల్ కోట: మామిడి రైతులతో సమావేశమైన జిల్లా ఉద్యానవన అధికారి
ఎల్ కోట మండలం భీమాలి తదితర గ్రామాల్లోని మామిడి రైతులతో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జమదాగ్ని మంగళవారం సమావేశమయ్యారు. మామిడి పంటలో తామర పురుగు ఉధృతిని అరికట్టేందుకు తీసుకోవలసిన సస్యరక్షణ పద్ధతుల గురించి వివరించారు. అనంతరం మామిడి, జీడి మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంచు తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. మండల ఉద్యానవన అధికారులు పద్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్