ఎల్ కోట మండలం రెళ్లి గౌరమ్మపేటలో నూతనంగా నిర్మించిన వెల్నెస్ సెంటర్ ను విశాఖ ఎంపీ బీజీ భరత్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో కలసి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి కట్టుబడి పని చేస్తోందని అన్నారు. వెల్నెస్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు, కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.