ఎస్. కోట: కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి వైసిపికి లేదు

77చూసినవారు
ఎస్. కోట: కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి వైసిపికి లేదు
కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి వైసిపికి లేదని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శనివారం ఎస్. కోట టిడిపి కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నాడు జగన్ ప్రభుత్వంలో చేసిన అవినీతి కారణంగా విద్యుత్తు రంగంపై పెను భారం పడిందని మండిపడ్డారు. వైసిపి హయాంలో 8 సార్లు పైగా విద్యుత్ చార్జీలు పెంచారని, రోడ్డెక్కి ధర్నాలు చేసినా ప్రజలపై విద్యుత్ భారం కచ్చితంగా జగన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్