వేపాడ మండలం ఆతవ రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 219లో గల నీలగిరి తోటలో బుధవారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. గమనించిన స్థానిక రైతులు ఎస్ కోట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన పరిసర వ్యవసాయ రైతులు ఊపిరి పీల్చుకున్నారు.