తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గురువారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గల పరిస్థితులపై ఆయన ముచ్చటించారు. భవిష్యత్ కార్యాచరణ పై జగన్మోహన్ రెడ్డితో ఆయన కాసేపు చర్చించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.