పెద్దఖందేపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

85చూసినవారు
పెద్దఖందేపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
శృంగవరపుకోట మండలం పెద్దఖండే పల్లి గ్రామంలో బుధవారం సచివాలయ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సర్పంచ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి, మాట్లాడుతూ గాంధీ పాటించిన అహింస పద్ధతులను తప్పనిసరిగా అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాళ్ళ్ళ వెంకటరమణతో పాటు ఎంపీటీసీ బోదల దేముడు, వైస్ సర్పంచ్ సూర్యనారాయణ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్