జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా కొత్తవలస మండలం మంగళపాలెం నుంచి సింహాచలం వరకు గిరిపుత్రులు శనివారం పాదయాత్ర నిర్వహించారు. రాపర్తి జగదీశ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో అరకు, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 60 గ్రామాల నుంచి సుమారు 2,000 మంది పాల్గొన్నారు.