జామి మండలం పీతలపాలెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. షుగర్ ఫ్యాక్టరీ ఏరియాకు చెందిన ఓ వ్యక్తి తన బైక్ పై ఎస్కోట వైపు వస్తున్న నేపథ్యంలో ఎస్కోట మండలం తిమిడికి చెందిన మరో వ్యక్తి తన బైక్ పై విజయనగరం వెళ్తున్న క్రమంలో రెండు బైకులు ఎదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఓ బైకు దగ్ధమైంది. అలాగే ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.