జామి మండలం లొట్లపల్లికి చెందిన జూనియర్ లైన్మెన్ షేక్ రెహమాన్ ఇటీవల విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెహమాన్ కుటుంబ సభ్యులకు ఏపీ ఈ ఈ యు 1104 యూనియన్ తరుపున ఆదివారం రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని యూనియన్ సభ్యులు తెలిపారు. రీజనల్ సెక్రెటరీ ఎస్ లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగునాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.