ఎండలో చెమట చిందిస్తూ రాళ్లు కొట్టి జీవించే జామి మం. లొట్లపల్లికి చెందిన దంపతులు షేక్ మదీనా వలీ, నన్నీబీ. తమ కుమారుడు రెహమాన్ చదువుతో ఎదగాలని ఆశించారు. అతను విద్యుత్తు సహాయకుడిగా సచివాలయంలో ఉద్యోగం పొందే వరకు కష్టపడ్డారు. కానీ అంతవోనే విధి వక్రించింది. సమస్య పరిష్కారానికి స్తంభం ఎక్కిన రెహమాన్‌కు హెచీ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.