అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో శ్రీధర్ బాబుపై దాడి చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షులు కంది వెంకటరమణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో పై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియపరచేలా శిక్షించాలని కోరారు.