జామి మండలంలో విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమం

83చూసినవారు
జామి మండలంలో విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమం
జామి మండలం ముకాసా కొత్తవలస లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మండల టిడిపి అధ్యక్షులు పి స్వామి నాయుడు బుధవారం విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్