శృంగవరపుకోట మండలం పెద్దఖండేపల్లిలో సోమవారం రాత్రి అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కోలాటం పోటీలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాజీపేట జట్టు ప్రథమ స్థానం, ఎస్.కోట చుక్క వీధి జట్టు ద్వితీయ స్థానం, ముసిడిపల్లి జట్టు తృతీయ స్థానం సాధించాయి. వీరికి నగదు బహుమతులు అందజేశారు. రాత్రి 10 గంటలకు బుర్రకథ కార్యక్రమం జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.